Gandhi Bhavan Protest Hyderabad
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోదీ నివాసం వద్ద ఆందోళనకు నిరసనగా, కాంగ్రెస్, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీ భవన్ ముట్టడికి తరలిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, బీజేపీ నాయకుడు రామచందర్ రావును అరెస్ట్ చేశారు.
