* బాంబుల తీవ్రత వారి అంతరాత్మకు తెలుసు
* సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో బస
* రాష్ట్ర రెవిన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఆకేరు న్యూస్ , వరంగల్ ప్రతినిధి :
ఎలాంటి బాంబులు పేలాయో .. వారి ఆత్మకు తెలుసు.. ఇప్పటికే పేలిన దీపావళి బాంబుల వల్ల పడుతున్న ఇబ్బందులను ఏ విదంగా కప్పిపుచ్చుకుంటున్నారో అందరికీ తెలిసిందే.. బీఆర్ ఎస్ మాట్లాడే ప్రతీ మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవిన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18 వ తేదీన మేడారంలో బస చేస్తారు.. మరుసటి రోజు సమ్మక్క- సారలమ్మ దేవాలయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి శ్రీనివాస రెడ్డి చెప్పారు. మేడారంలో రూ.300 కోట్లతో చేపట్టిన పనులు 90 శాతానికి పైగా పూర్తయినాయన్నారు. వరంగల్ జిల్లాను హైదరాబాద్ తర్వాత తెలంగాణ రెండో రాజధానిగా ఎదిగే విదంగా అన్ని రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నామని మంత్రి చెప్పారు.
*మామునూరు విమానాశ్రయం త్వరలో శంకుస్తాపన
దశాబ్దాలుగా ఆచరణకు నోచుకోని మామునూరు విమానాశ్రయాన్ని త్వరలోనే శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఇటీవలనే విమానాశ్రాయానికి సంబందించిన భూ సేకరణ పనులు పూర్తయినాయి. ఇందుకోసం కృషి చేసిన జిల్లా అధికారులను అభినందిస్తున్నామని మంత్రి అన్నారు. హౌజింగ్ బోర్డు తో ఇండ్లు నిర్మించి పేద మద్య తరగతి ప్రజలకు అందించే కార్యక్రమానికి వరంగల్లోనే శ్రీకారం చుట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం అవసరమైన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబందించి బ్యాలన్స్ వర్క్ చేయాలని నిర్ణయించాం.. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించాం. ఇక భద్రకాళి దేవాలయ మాడ వీదుల నిర్మాణంతో పాటు ఆలయ పునరుద్దరణ పనులు కూడా త్వరలోనే చేపడుతాం .ఇందుకోసం ఈ రోజు భద్రకాళి దేవాలయాన్ని సందర్శిస్తున్నామన్నారు.
* వరంగల్ వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం
వరంగల్ నగరంలో ఇటీవల భారీ వర్షం వల్ల వరదలు ముంచెంత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరంలోని వరద ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా ఇక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం వరద నివారణకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విదంగా వరదల వల్ల కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ముంపుకు గురవుతోంది. డ్రైనేజీ వ్యవస్థ, నాలాలపై రిటెయినింగ్ వాల్స్ , వరదలు వచ్చినప్పుడు డిస్ చార్జీ కెపాసిటీకి అనుగుణంగా కల్వర్టులకు లేక పోవడం వల్ల ఇండ్లు ఐదు మీటర్ల వరకు నీళ్ళల్లో మునిగాయని గుర్తించామని మంత్రి చెప్పారు. అ అంశాలన్నీ చర్చించి వరంగల్ నగరానికి మరో సారి వరద ముప్పు రాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో స్పోర్గ్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామి రెడ్డి లతో పాటు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
—————————
