ఆకేరు న్యూస్, డెస్క్ :
గుజరాత్ రాజ్ కోట్లోని గేమింగ్ జోన్ లో రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదం దిగ్బ్రాంతిని గురి చేసింది. ఆ ప్రమాదంలో ఏకంగా 28 మంది సజీవ దహనం అయ్యారు. ఎంతో మంది ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాదంపై ప్రధానమంత్రి నరంద్రమోదీ సైతం దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించారు. గేమింగ్ జోన్ లో చేపట్టిన వెల్డింగ్ పనుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. నిప్పు రవ్వల వల్లే మంటలు వ్యాపించాయని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.
——————–