* ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం
– ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్, హనుమకొండ : హనుమకొండ:సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని, వారి సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ నివాసంలో గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (GTA) రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీ ,క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ..విద్యాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇందులో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం GTA సంఘం ఐక్యతతో ముందుకు సాగడం గొప్ప విషయమని ప్రశంసించారు.అంతకుముందు, GTA నాయకులు ఎంపీ కడియం కావ్యను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం చేస్తున్న కార్యక్రమాలను ఆమెకు వివరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో GTA వరంగల్ జిల్లా స్థాయి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు… వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి ప్రకాష్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షులు పూస నరేంద్ర స్వామి, ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, దొరికెన శ్రీకాంత్, ఆకోజు కిరణ్, కోశాధికారి బిల్లా కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి బజ్జురి గంగాధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి దొంతి రఘు, కిలా వరంగల్ మరియు వరంగల్ బాధ్యులు గుడిమల్ల వెంకటేశ్వర్లు, భరత అశోక్, పోతుగంటి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు

