* సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తామనే ప్రచారం జరుగుతోందని ఉమ్మడి పాలమూరు జిల్లా జోలికి వస్తే ఊర్కునేది లేదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం చేయడం కాంగ్రెస్కు చేతకావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆగిపోయిందని అన్నారు. ఒకప్పుడు పాలమూరు జిల్లానుంచి వలసలు ఉండేవని ఇప్పుడు వలసలు తగ్గి హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. పాలమూరుకు నీటి ప్రాజెక్టులను తెచ్చిన ఘనత బీఆర్ ఎస్ ప్రభుత్వానిదే అని కేటీఆర్ అన్నారు.రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ అభివృద్ధి జరగలేదని, పంచాయతీలకు ట్యాంకర్లలో నీరు, ట్రాక్టర్లలో డీజిల్ కూడా లేకుండా పోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో 40 సీట్లు వచ్చిన బీఆర్ఎస్కు మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ‘బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తెలు తాడు దోచే రకం’ అని తీవ్రంగా విమర్శించారు.
……………………………………………

