* నాయిని పనితీరు బాగుంది
* ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్, హనుమకొండ :హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ,..వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న విశ్వాసాన్ని మరింత పటిష్టం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల కోసం కాదు, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే సిద్ధాంతబద్ధమైన పార్టీ అని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ మరింత బలపడేలా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. కాజీపేట బ్రిడ్జి, నాలా సమస్యల పరిష్కారం, వరద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి ఎన్నో కీలక పనులను విజయవంతంగా చేపట్టారని తెలిపారు. నాయిని రాజేందర్ రెడ్డి అవినీతి రహిత పాలనను అందిస్తూ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ ఎస్ నాయకులు రౌడీయిజం, అరాచక రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అజెండా పూర్తిగా అభివృద్ధి, ప్రజా సంక్షేమమేనని స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారి డివిజన్ పర్యటనను విజయవంతం చేసి, పార్టీ బలాన్ని మరింత పెంచాలని కార్యకర్తలకు సూచించారు.అనంతరం నేడు ప్రియాంక గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వారికి ఎంపీ డా. కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజకీయాల్లో ప్రజల సమస్యలపై నిలబడి పోరాడుతున్న నాయకురాలిగా ఆమె సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
