* చైర్ పర్సన్ గా ఇరుప సుకన్య
* తోలి సారి 13 మంది మహిళ సభ్యులు.
* ఒక్కరు ఎక్స్ ఆఫీసీయో మెంబర్.
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారమ్మ మహా జాతర ఉత్సవ కమిటీ చైర్ పర్సన్ తో పాటు 13 మంది మహిళ సభ్యులు ఒక్కరు ఒక్కరు ఎక్స్ ఆఫీసీయో మెంబర్ గా శనివారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) హాజరయ్యారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఈనెల 28 నుంచి 31 వరకు జరుగు సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర ఉత్సవ కమిటీని నియమిస్తూ ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శనివారం హరిత హోటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మేడారం జాతర కార్యనిర్వాహణ అధికారి వీరస్వామి ఫెస్టివల్ కమిటీ సభ్యుల తో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో చైర్ పర్సన్ గా ఇరుప సుకన్య సునీల్ దొర, తో పాటు కమిటీ సభ్యులుగా గీకురు భాగ్యలక్ష్మి ,మైపతి రచన,సూది రెడ్డి జయమ్మ ,పాయం రమణ ,చింత చంద్రకళ, పులుసం పుష్పలత, గుంటోజు పావని, పొడెం రాణి, జనగాం గంగా లక్ష్మి, భూక్య వసంత, జజ్జరి మమత ,గంటమూరి భాగ్యలక్ష్మి ,వద్దిరాజు విజయలక్ష్మి లతో పాటు ఎక్స్ ఆఫీసీయో సభ్యులుగా సిద్ధబోయిన జగ్గారావు లు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జాతర దేవాదాయ శాఖ ఆధీనములోకి వెళ్లినప్పటి నుండి నేటి వరకు మహిళలకు జాతర ట్రస్టు బోర్డులో సభ్యులుగా మహిళలకు అవకాశం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కృషి చేస్తూ అన్ని రంగాలలో ముందుండాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో పలువురు ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను నియమించడంతో ఈ కమిటీ ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతున్నదని పలువురు అభిప్రాయం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ప్రజా ప్రతి నిధులు , ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

……………………………………….

