ఆకేరు న్యూస్ ,హైదరాబాద్ :హైదరాబాద్ నాంపల్లిలో శనివారం ఒక్కసారిగా భీతిల్లజేసే ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉండే స్టేషన్ రోడ్‌లోని ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.ప్రమాదం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫర్నిచర్ దుకాణంలో ప్రారంభమైంది.నాలుగు అంతస్తుల భవనం పైకి మంటలు అంటుకున్నాయి.అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. మంటలు చెలరేగిన సమయంలో భవనం పై అంతస్తుల్లో ఇద్దరు చిన్నారులుసహా మొత్తం ఆరుగురు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో వారు బయటకు రాలేక లోపలే ఉండిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఐదుకు పైగా ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే అధికారులు దీనిపై పూర్తి విచారణ జరిపిన తర్వాతే అసలు కారణాలు తెలవనున్నాయి.
……………………………………………………………………
