ఆకేరు న్యూస్,ములుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మొదట ఆయనకు పూజారులు దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవార్ల గద్దెలపై ఆచార సంప్రదాయాలతో పసుపు కుంకుమ బంగారం నిలువెత్తు బెల్లం సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. గద్దెల పరిసరాలలో మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్టీసీ చైర్మన్ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్, జాతర కార్యనిర్వాహణాధికారి వీరస్వామి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు లతోపాటు ఆర్టిసి పోలీస్ వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………..
