* ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా..
ఆకేరు న్యూస్, విజయవాడ : ఏపీ ఈసెట్ ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 90.41 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(AP ECET) – 2024 ప్రవేశ పరీక్షను మే 8న రాష్ట్రంలోని 14 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ ఈసెట్ జవాబు కీ మే 10న విడుదలైంది. ఈ ఎగ్జామ్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, B.Sc (గణితం) డిగ్రీలు ఉన్న విద్యార్థులు వారి ECET ర్యాంకుల ఆధారంగా రెండవ సంవత్సరం B.Tech, B.ఫార్మసీ ప్రోగ్రామ్లలో నేరుగా ప్రవేశం పొందవచ్చు. అభ్యర్థులు cets.apsche.ap.gov.inలో మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ఏపీ ఈసెట్ ఫలితం 2024ని పొందవచ్చు. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
——————