* కాజీపేట రైల్వే స్టేడియం నుండి ప్రత్యేక బస్సులు ప్రారంభం
ఆకేరు న్యూస్,హన్మకొండ: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం TGSRTC వరంగల్-2 డిపో ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే స్టేడియంలో ప్రత్యేక బస్ ప్రాంగణాన్ని ప్రారంభించారు. కాజీపేట రైల్వే జంక్షన్‌కు చేరుకునే రైలు ప్రయాణికులు హన్మకొండ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఇక్కడి నుంచే మేడారం చేరుకునే లాగా ఏర్పాట్లను చేశారు.వరంగల్-2 డిపో మేనేజర్ శ్రీ ఎం. రవిచందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాజీపేట ఎస్హెచ్ఓ ఎం. సుధాకర్ రెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్, రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని బస్ క్యాంపును ప్రారంభించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ క్యాంపు వద్ద మెరుగైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు .రైలు ప్రయాణికుల కోసం నిరంతరాయంగా బస్సు సౌకర్యం.క్యూ లైన్లు, తాగునీరు, మెడికల్ క్యాంపు మరియు టాయిలెట్ సౌకర్యాలు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వ ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళలకు మేడారం వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది.పెద్దలకు: ₹250/-పిల్లలకు (హాఫ్ టికెట్): ₹150/-ఈ కార్యక్రమంలో రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ ట్రెజరర్ జి. రాజేశ్వర్ రావు, తెలంగాణ రైల్వే జేఏసీ ఛైర్మన్ కోండ్ర నర్సింగారావు, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ భవాని, ఆర్గనైజర్ బైరి రవీందర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.దూర ప్రాంతాల నుండి రైళ్లలో వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా మేడారం చేరుకోవాలని డిపో మేనేజర్ రవిచందర్ కోరారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
