* కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు…
ఆకేరు న్యూస్ ,ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ సైనిక పటిమ, సాంస్కృతిక వైభవం కలబోసి నిర్వహించిన ఈ పరేడ్ వీక్షకులను ఎంతో గాను మంత్రముగ్ధులను చేసింది.మువ్వన్నెల జెండా సాక్షిగా త్రివిధ దళాలు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రమశిక్షణతో కూడిన అడుగులు, గంభీరమైన సైనిక వందనం భారత సైనిక శక్తిని చాటిచెప్పాయి. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు మరియు స్వదేశీ సాంకేతికతతో తయారైన యుద్ధ పరికరాలను సైన్యం గర్వంగా ప్రదర్శించింది. ఆకాశంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు చూసి జనం ఆశ్చర్యపోయారు. ఆకాశంలో రంగు రంగుల పొగలు చిమ్ముతూ విమానాలు చేసిన సందడి ఉద్వేగాన్ని నింపింది.కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన శకటాలు భారతదేశం యొక్క “భిన్నత్వంలో ఏకత్వాన్ని” ప్రతిబింబించాయి. రాష్ట్రాల నుంచి శకటాలు వచ్చాయి. ప్రతి శకటం ఒక ప్రత్యేక సంస్కృతిని, కళను చాటిచెప్పింది.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ అతిథులకు భారతీయ సంస్కృతి మరియు రక్షణ రంగంలోని ప్రగతిని స్వయంగా వివరించారు. ఈ వేడుకలు కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, నవ భారత ఆశయాలకు మరియు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి నిదర్శనంగా నిలిచాయి.
…………………………………………
