ఆకేరు న్యూస్,హనుమకొండ:77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హనుమకొండ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి *వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించి, కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………….
