ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో గ్రంథాలయ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. గ్రామంలోని రైల్వే స్టేషన్ వద్ద గల పాత గ్రామపంచాయతీ భవనంలో పౌర పఠన కేంద్రాన్ని హనుమకొండ జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు అజీజ్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయానికి కావలసిన సామాగ్రి, నూతన పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. గ్రంధాలయ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. గ్రంథాలయ ఏర్పాటు కోసం కృషి చేసిన భీమ్ రావ్ అంబేద్కర్ యూత్ సభ్యుల సేవలు అభినందనీయం అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం , యూత్ సభ్యులు జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు అజీజ్ ఖాన్ ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమ- నాగరాజు, ఉప సర్పంచ్ మేడిపల్లి సిద్ధార్థ, వార్డు సభ్యులు, మాజీ జెడ్పిటిసి మారపల్లి నవీన్, గ్రామ పెద్దలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, రాష్ట్ర మాజీ గ్రంథాలయ డైరెక్టర్ ఎ.వి.ఎన్. రాజు , విశ్రాంత ఉపాధ్యాయులు, డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

……………………………………………
