* బీఆర్ ఎస్ లో చేరేందుకు ఏర్పాట్లు
ఆకేరు న్యూస్ , వరంగల్ : మునిసిపల్ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీకి రాజకీయ జలక్ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీ పార్టీ కి రాజీనామా చేశారు. ఈమేరకు బీజేపీ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపించారు. తిరిగి భారత రాష్ట్ర సమితి లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆహ్వానం మేరకు నా ఇంటి పార్టీ బీఆర్ఎస్లోకి త్వరలో నాయకులు, నా అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నాను’ అని ప్రకటనలో అరూరి రమేష్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. బీజేపీ అధిష్టానం రమేశ్ ను వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. లోక్ సభ అభ్యర్థిగా ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి బీజేపీలో నామ మాత్రంగా కొనసాగుతున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి , జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర నాయకులు ఆరూరి రమేశ్‌ను బీఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు ఒప్పించినట్లు సమాచారం.
———————–

………………………………………………………
