ఆకేరు న్యూస్ :
హైదరాబాద్ : బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు ఈరోజు ఉదయం నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితర రాజకీయ ప్రముఖులు ఈ అంతక్రియల్లో పాల్గొన్నారు. అజిత్ పవార్‌ను కడసారి చూసేందుకు ఆయన వర్గం ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున మైదానానికి వచ్చి అధినేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు.
