Nemaligonda Congress President Kola Somaiah
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
పార్టీ, గ్రామస్తులు నాకు కల్పించిన అవకాశంతో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నెమలిగొండ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు కోల సోమయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నెమలిగొండ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక గురువారం ఏకగ్రీవంగా జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా నాయకులు నూకల బాల్ రెడ్డి, జిల్లెల సిద్ధారెడ్డి, బి.శివయ్య, జె.కిష్టయ్య, ఎల్.రాజేందర్, నాగరబోయిన శ్రీరాములు, అమృతా రెడ్డి గౌరవ అధ్యక్షులు పురమని ఐలోని, మోటం ప్రభాకర్, రజాక్ యాదవ్ పర్యవేక్షణలో ఎన్నిక జరిగింది. అధ్యక్షుడుగా కోలసోమయ్య, ఉపాధ్యక్షులు పదిరే రవీందర్ రెడ్డి, గాదె రవి, దాసోజు శ్రవణాచారి, ప్రధాన కార్యదర్శులు పెద్దపుండ్ర వెంకట్ రెడ్డి, తాటి రవి, సహాయ కార్యదర్శులు కోల తిరుపతి, గుండె చంద్రమౌళి, పెద్దపుండ్ర సారల్ రెడ్డి, ప్రచార కార్యదర్శులు కోల సమ్మయ్య, లద్దునూరి రాజు కోశాధికారులు కే కొమురయ్య, మచ్చ యాదగిరి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
