* మేమైనా వస్తాం.. మీరైనా రండి..
* కేసీఆర్ కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ అధికారులు వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 65 ఏళ్ల వయసు దృష్య్టా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని అధికారులు కేసీఆర్ కు సూచించారు. 65 ఏళ్ల పైబడిన వారిని పోలీస్ స్టేషన్ కు పిలవ వద్దని నిబంధన ఉందని, ఇబ్బంది లేకపోతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ కు రానట్లయితే హైదరాబాద్ లో అనువైన ప్రదేశాన్ని సూచించవచ్చని పేర్కొన్నారు. ఎక్కడ విచారించమంటారో చాయిస్ ఆయనకే ఇచ్చారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరి పేరుతో నోటీసులు అందజేశారు. గజ్వేల్ అసెంబ్లీ ఎమ్మెల్యే కేసీఆర్ పేరుతో ఆయనకు నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఈమేరకు ఆయనకు ఈ నోటీసులు అందజేశారు. నోటీసులపై న్యాయవాదులతో సమాలోచనలు చేయనున్నారు.
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
