* స్టేషన్ ఘన్ పూర్, ఆకేరు న్యూస్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ- జిట్టగూడం, ఇప్పగూడెం. చిల్పూర్ మండలం గార్లగడ్డ తండా- ఫతేపూర్ మినీ మేడారాలలో గద్దెలపై కొలువుతీరిన సమ్మక్క, సారలమ్మలను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని సమ్మక్క, సారలమ్మ లను కోరుకున్నట్లు తెలిపారు. వన దేవతల దర్శనం అనంతరం భక్తులు ఇళ్లకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు. ఇప్పగూడెం జాతరలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య, జాతర చైర్మన్ తోట వెంకన్న సర్పంచులు శిరీష్ రెడ్డి, రాణి, సోమయ్య, దేవాదాయ శాఖ అధికారులు లక్ష్మీ ప్రసన్న, వెంకన్న, రమేష్, వీరన్న నాయకులు మంద రాజు, అజయ్ రెడ్డి, మునిగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తాటికొండ జాతర గౌరవ అధ్యక్షుడు చల్ల సుధీర్ రెడ్డి, సర్పంచులు సుజన శ్రీనివాస్, బాలు ఉప సర్పంచ్ లు కట్టమల్లు, రవీందర్ నాయకులు రాపోలు మధుసూదన్ రెడ్డి, ఐలోని సుధాకర్, పోకల నారాయణ, నారదాసు కుమారస్వామి, పిట్టల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఫతేపూర్- గార్లగడ్డ జాతరలో ఎమ్మెల్యే తో పాటు జాతర చైర్మన్ యాకూబ్, సర్పంచులు లక్ష్మీ ఉమ్ల నాయక్, నవీన్, మాజీ సర్పంచ్ రూపుల నాయక్, రామ్ లాల్ స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
———————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
