MLA Kadiyam Srihari Station Ghanpur Development
* 15 ఏళ్లలో ఏం జరిగింది ?
* రెండున్నర ఏళ్లలో ఏం జరుగుతుంది
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో జాతీయ రహదారి నుండి మల్లన్న గండి వరకు 15 కోట్లతో నిర్మించిన బిటీ రోడ్డు, 30లక్షలతో నిర్మించిన అంతర్గత సిసి రోడ్లతో పాటు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. 30 లక్షలతో నిర్మించనున్న 3 వివో భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు.
అనంతరం సర్పంచ్ సుజన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ తాటికొండ గొప్ప రాజకీయ చైతన్యం కలిగిన గ్రామం అన్నారు. తాటికొండ గ్రామానికి నేను ఎమ్మెల్యే అయిన ఈ రెండున్నర ఏళ్ల కాలంలో 29 కోట్లతో కుడి కాలువ పూర్తి చేసిసాగు నీరు అందించాను, జాతీయ రహదారి నుండి మల్లన్న గండి వరకు వయా తాటికొండ, కొత్తపల్లి, జిట్టేగూడెం మీదుగా 15 కోట్లతో బిటీ రోడ్డు నిర్మాణం చేశాను, గ్రామంలో 50 లక్షల సిసి రోడ్లు, 50 ఇందిరమ్మ ఇండ్లు, 30 లక్షలతో 3 వివో భవనాలు మంజూరు చేశానని తెలిపారు. గత 15ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎం పనులు చేశాడో ప్రజలు ఒకసారి గమనించాలని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎం పనులు చేశానో చూడాలని కోరారు. తెల్లారి లేస్తే అవినీతి, అక్రమాలకు తోడు చిల్లర పనులతో నియోజకవర్గ పరువు తీసాడని ఆరోపించారు. ప్రతీ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారించాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో నేను పని చేస్తున్నాని వెల్లడించారు. నీతి నిజాయితీగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడే వారికి ప్రజల సహకారం ఉండాలని కోరారు. తాటికొండ గ్రామ పరిధి వరకు బిటీ రోడ్డు స్థానంలో సిసి రోడ్డు, సైడ్ డ్రానేజి లను 6 నెలలో నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఇళ్ల పైనుండి వెళ్లే విద్యుత్ లైన్ల తొలగింపుకు మంజూరు తీసుకువస్తానని తెలిపారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్, అధికారంలోకి రావాలనే ఆశతో బీజేపీ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని చెప్పారు. ఆనాడు కోటి 60 లక్షలతో చిన్న ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన మల్లన్న గండి ఆ తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్ గా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ రోజు మల్లన్న గండి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ గుట్టలు, పచ్చటి చెట్లు, పొలాలతో పర్యాటక కేంద్రాన్ని తపిస్తోందని అన్నారు. మల్లన్న గండి రిజర్వాయర్ ద్వారా చిల్పూర్, స్టేషన్ ఘనపూర్ మండలాలకు సాగు నీటితో పాటు త్రాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. మల్లన్న గండి కొనసీమ వాతావరణాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. 29 కోట్లతో మల్లన్న గండి కుడి కాలువను గత సంవత్సరమే పూర్తి చేసుకొని సాగు అందిటున్నట్లు తెలిపారు. కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలను కాపాడుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పని ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.
రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు రెండో సంవత్సరం 2 లక్షల 50 వేల ఇల్లు మొత్తం 35 వేల కోట్లతో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డ్ సృష్టించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు మిత్తిలు కడుతూ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే 6 గ్యారెంటీల అమలులో భాగంగా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 2 లక్షల 50 వేల కొత్త పెన్షన్లు, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని వెల్లడించారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దూదిపాల నరేందర్ రెడ్డి, రాపోలు మధుసూదన్ రెడ్డి, బేతి జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పంచాయతీ రాజ్, హౌసింగ్ శాఖల అధికారులు, మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
