Rashmika Mandanna Love Comments
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రముఖ నటి రష్మిక మందన తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల మైసా మూవీ చిత్రీకరణలో భాగం గా ఒక పాటకు డ్యాన్స్ చేస్తుండగా కింద పడటంతో తుంటికి గాయమైంది. దీంతో ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఇంట్లో ఖాళీగా ఉండటంతో బహుశా టైం పాస్ కావడం లేదనుకుంటాను.. సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసుకున్నారు. క్యాప్షన్ లో ఎప్పుడూ బిజీగా ఉంటే పని ఒత్తిడి అనిపించదు కాని ఖాళీ ఉండాలంటే మాత్రం బోర్ కొడుతుంది. ఒక సారి క్షణం తీరిక లేకుండా ఉన్నప్పుడు రోజులను తలచుకుంటుంటే భయం వేస్తుందని రాసుకొచ్చారు. ఈ సమయంలో ఎంతో మంది ప్రేమానురాగాల్లో మునిగిపోతున్నానని చెప్పుకొచ్చారు.
* 2025 రష్మిక నామ సంవత్సరం
చావా, కుబేర, సికందర్, థామా, ది గర్ల్ ఫ్రెండ్, కాక్ టెయిల్ 2 వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించారు. ‘ఛావా’ సినిమాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చారిత్రక చిత్రంలో రష్మిక యేసుబాయి పాత్రలో కనిపించారు. ధనుష్, నాగార్జునలతో కలిసి రష్మిక నటించిన ‘కుబేర’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన ‘సికందర్’ కూడా రష్మిక కెరీర్లో మరో ముఖ్యమైన చిత్రం. థామా లో రష్మిక మరో విభిన్నమైన పాత్రలో కనిపించారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.
* స్థానం మరింత పదిలం
2026లో ‘కాక్టెయిల్ 2’తో రష్మిక మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించారు. షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి నటించిన ఈ చిత్రానికి హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నం చేశారు.
* ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు
ప్రస్తుతం మైసా, రాకా, రణబలి పుష్ప 3 చిత్రాలు వంటి బడా సినిమాల్లో కనిపించబోతున్నారు. మైసా, రణబలి, రాకా చిత్రాలు షూటింగ్ దశల్లో ఉన్నాయి. రణబలి చిత్రాన్ని మేకర్స్ .. సెప్టెంబర్ 11న విడుదల చేస్తారని తెలుస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
