Kaunik Vardhan Sailing Competition
* వంగపల్లి ముద్దుబిడ్డ కౌనిక్ వర్ధన్‌కు ఘన స్వాగతం, సన్మానం
* డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి దేవరాజు కౌనిక్ వర్ధన్ ఇటలీ వేదికగా జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో ప్రపంచ దేశాల క్రీడాకారులతో పోటీపడి 13వ స్థానంలో నిలిచి శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. విదేశాల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి స్వగ్రామానికి తిరిగి వచ్చిన కౌనిక్ వర్ధన్ కు గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనకు కృతజ్ఞతా భావంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరిస్తూ వంగపల్లి గ్రామ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు వాసలా శ్రీనివాస్ , గ్రామ ప్రజలు కౌనిక్ వర్ధన్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసల శ్రీనివాస్, సీనియర్ నాయకులు డాక్టర్ మౌటం కుమారస్వామి, గ్రామ వార్డు సభ్యులు ఎలుకటి అనిల్, ఎలుకటి వనిత అశోక్, గ్రామ సీనియర్ నాయకులు ఆకునూరి సాంబయ్య, చిలువేరి రవీందర్, ఎండీ అంజాద్, ఉడుత సాయికృష్ణ, పెనుకుల ఐలయ్య, మండల నాయకులు పరశురాములు, పుల్ల శోభన్ బాబు, అనిల్ తదితరులు పాల్గొని కౌనిక్ వర్ధన్‌ను అభినందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
