స్టేషన్ ఘన్ పూర్, ఆకేరు న్యూస్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ చిల్పూర్ మండలాల్లోని మినీ మేడారాలలో గద్దెలకు చేరిన వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. చిల్పూర్ మండలం గార్లగడ్డ తండా-ఫతేపూర్, లింగంపల్లి, కొండాపూర్ – శ్రీపతి పల్లి, చిల్పూర్. స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ-జిట్టగూడం, ఇప్పగూడెం గ్రామాల్లోని సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారాలు, ఎదుర్కోర్లతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. లింగంపల్లిలో చైర్మన్ కండ్లకుల శ్రీనివాస్, ఈవో అనిల్, ఇప్పగూడెం జాతరలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య, జాతర చైర్మన్ తోట వెంకన్న సర్పంచులు శిరీష్ రెడ్డి, రాణి అనిల్, సోమయ్య, దేవాదాయ శాఖ అధికారులు లక్ష్మీ ప్రసన్న, వెంకన్న, రమేష్, వీరన్న నాయకులు మంద రాజు, అజయ్ రెడ్డి, మునిగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తాటికొండ జాతర గౌరవ అధ్యక్షుడు చల్ల సుధీర్ రెడ్డి, సర్పంచులు సుజన శ్రీనివాస్, బాలు ఉప సర్పంచ్ లు కట్టమల్లు, రవీందర్ నాయకులు రాపోలు మధుసూదన్ రెడ్డి, ఐలోని సుధాకర్, పోకల నారాయణ, నారదాసు కుమారస్వామి, పిట్టల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఫతేపూర్- గార్లగడ్డ జాతరలో చైర్మన్ యాకూబ్, సర్పంచులు లక్ష్మీ ఉమ్ల నాయక్, నవీన్, మాజీ సర్పంచ్ రూపుల నాయక్, రామ్ లాల్ ఏ సి పి భీమ్ శర్మ, సిఐలు శ్రీనివాసరెడ్డి, వేణు ఎస్ఐలు వినయ్ కుమార్, రాజేష్, నవీన్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
……………………………………………………
