HMDA Chief Engineer Raid
అకేరు న్యూస్, హైదరాబాద్ :హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. HMDA చీఫ్ ఇంజినీర్ రవీందర్ ఇంటిలో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయం, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నగరంలో 12 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నోట్ల కట్టలు, వివిధ ఆస్తి పత్రాలు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ.. అందినకాడికి లంచాలు తీసుకుని వందల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వచ్చిన అవినీతి తిమింగలాల బాగోతాన్ని ఇటీవలే ఏసీబీ బట్టబయలు చేసింది.
కోట్ల కొద్దీ నగదు, కిలోల కొద్దీ బంగారాన్ని సీజ్ చేసి.. అవినీతి అధికారులను కటకటల్లోకి నెట్టింది ఏసీబీ.
మరోవైపు పెద్దపల్లి జిల్లా అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరుగెత్తించింది. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తూన్న ఏఈ సతీష్.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.
మున్సిపాలిటీ పరిధిలో జరిగిన పనులకు సంబంధించి బిల్లులు క్లియర్ చేసేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి ఏఈ సతీష్ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బత్తు శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించాడు. లంచం ఇస్తుండగా రైడ్ చేసి.. ఏఈని పట్టుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
