ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: గద్దెలపై కొలువుదీరి మూడు రోజులపాటు భక్తులకు దర్శనం ఇచ్చి కోరిన కోరికలు తీర్చిన భక్తుల కొంగుబంగారాలు సమ్మక్క, సారలమ్మలు శనివారం జనం నుంచి వనప్రవేశం చేశారు. ఇప్పగూడెం జాతరలో ఎమ్మెల్యే జాతర చైర్మన్ తోట వెంకన్న దేవాదాయ శాఖ అధికారులు లక్ష్మీ ప్రసన్న, వెంకన్న, రమేష్, వీరన్న, మందపురం ఎల్లం గౌడ్ తదితరులు వన ప్రవేశం చేయించారు. తాటికొండ-జిట్టగూడం జాతర ప్రాంగణం నుండి సమ్మక్క సారలమ్మను కోయ పూజారు, జాతర కమిటీ సభ్యులు స్థానిక సర్పంచుల పర్యవేక్షణలో అర్ధరాత్రి తరవాత వన ప్రవేశం చేయించారు. చిల్పూర్ మండలం లింగంపల్లి జాతర గద్దల నుండి సమ్మక్క, సార్లమ్మను జాతర చైర్మన్ కండ్ల కోల శ్రీనివాస్, ఈవో వంశీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించి దేవతలను వన ప్రవేశం చేయించారు. గార్లగడ్డ తండా-ఫతేపూర్, కొండాపూర్ – శ్రీపతి పల్లి, చిల్పూర్ సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక జరిపించి జనం నుంచి వనానికి తరలించారు.

……………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
