*కరుణాపురంలో తుదిశ్వాస
* 24 ఏళ్ళు వరంగల్ బిషప్
* మరో పదేండ్లు హైదరాబాద్ బిషప్
ఆకేరు న్యూస్ , వరంగల్ : విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మ బాల ( Arch Bishop Thumma bala ) (80) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన కరుణాపురంలోని తమ బంధువుల ఇంటికి చేరుకున్నారు. గురువారం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. జనగామ జిల్లా నర్మెట్టలో తుమ్మ బాల , జోజి రెడ్డి, ఇన్నమ్మ దంపతులకు 1944 ఎప్రిల్ 24న జన్మించారు. 1970 లో పూర్తి కాలం క్రైస్తవ సేవకు అంకితమయ్యారు. 1987 నుంచి 2011 వరకు వరంగల్ బిషప్ గా సుధీర్ఘ కాలం పనిచేశారు. అనంతరం 2020 వరకు హైదరాబాద్ బిషప్గా సేవలు అందించారు. బిషప్ తుమ్మ బాల మృత పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పార్థీవ దేహాన్ని ఫాతిమా కేథడ్రల్ చర్ఛ్ ప్రజల సందర్శనానంతరం ఉంచారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్లోని సేయింట్ మేరి బసిలికా లో అంత్యక్రియలు జరుగుతాయని వరంగల్ బిషప్ కార్యాలయం తెలిపింది. వరంగల్ పరిసరాల్లో ఆయన చేసిన సేవా కార్యాక్రమాల వల్ల పేద వర్గాలకు ఎంతో లబ్ది చేకూరిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తుమ్మ బాల కడసారి చూపుల కోసం జనం పెద్ద ఎత్తున కదిలి వచ్చారు.
——————————————-