
కన్యాకుమారిలో 45 గంటల ధ్యానంలో ప్రధాని మోదీ
* రేపు పోలింగ్ ముగిసే వరకూ..
ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం మొదలుపెట్టారు. దాదాపు 45 గంటల పాటు ధ్యానంలోనే ఉండనున్నారు. ఏడు దశల ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించిన ఆయన గురువారం సాయంత్రం కన్యాకుమారికి (Kanyakumari) చేరుకున్నారు. అక్కడ భగవతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లటి ధోవతి, శాలువా ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అక్కడ నుంచి ఫెర్రీలో కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్దకు చేరుకున్నారు. 2019లో కూడా మే 19న తుది దశ పోలింగ్ జరిగింది. ఎన్నికల ప్రచారం ముగిశాక మే 18న మోడీ కాషాయ శాలువా ధరించి కేదార్నాథ్లోని రుద్రగుహలో 17 గంటలపాటు ధ్యానం చేశారు. ఇప్పుడు 45 గంటల పాటు ధ్యానం చేస్తున్నారు. రేపు సాయంత్రం పోలింగ్ ముగిసే వరకూ మోదీ ధ్యానంలోనే ఉంటారు.
———————–