ఆకేరు న్యూస్, కమలాపూర్:
నిజాయితీకి ఉదాహరణగా నిలిచిన 48 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ కార్మికురాలు పద్మ జనవరి 11, టీ.నగర్లో రోడ్డుపక్కన ₹45 లక్షల విలువైన 45 సవరన్ల బంగారు ఆభరణాల బ్యాగ్ దొరకటంతో, వెంటనే పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె నిజాయితీకి మెచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ జనవరి 12న ఆమెకు ₹1 లక్ష బహుమతి తో పాటు శాలువాతో సన్మానించారు. పద్మ నిజాయితీని గౌరవిస్తూ, భారత తపాలా శాఖ జనవరి 30న ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. ఇండియన్ పోస్ట్ తమిళనాడు సర్కిల్ ఆమె ఫోటోతో ప్రత్యేక స్టాంపును ‘మై స్టాంప్’ పోస్టల్ కవర్‌ను విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఆమెకు ప్రీమియం సేవింగ్స్ ఖాతా, రూ.15 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్, ఒక ఫిక్స్డ్ డిపాజిట్‌ను కూడా అందించింది. ఇది సాధారణుల్లో అసాధారణ నీతిని గుర్తుచేసే గొప్ప ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
………………………………………………………………..
