* బీఆర్ఎస్ నేతల అరెస్ట్…
ఆకేరు న్యూస్,ఖమ్మం: బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆదివారం నిర్వహించిన ఈ ఆందోళనలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సీఐ చెయ్యి విరిగింది.ర్యాలీకి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, అది గమనించిన ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్ అడ్డుకోవడంతో తోపులాట మొదలైంది. దిష్టిబొమ్మపై పోసిన పెట్రోల్ కారణంగా మంటలు సీఐకి అంటుకున్నాయి. CI కింద పడిపోవడంతో పోలీసులు వెంటనే సీఐని ఆస్పత్రికి తరలించారు. సీఐ కరుణాకర్ కి మణికట్టు వద్ద ఫ్యాక్చర్ అయినట్లు డాక్టర్ నిర్ధారించారు. టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పగడాల నాగరాజ్ తో పాటు కోయిలపొంగు వెంకట్, ఉపేందర్ ను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసుల సమాచారం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
