నశా ముక్త్ భారత్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరణ
* పోస్టర్ల ఆవిష్కరణ
Mulugu| ఆకేరు న్యూస్, ములుగు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కన్నాయిగూడెం తహసీల్దార్ ఎండీ సర్వర్ పాషా సూచించారు.
ములుగు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం కన్నాయిగూడెం మండల కేంద్రంలో నశా ముక్త్ భారత్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ చైర్మన్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఎండీ సర్వర్ పాషా ఈ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. డ్రగ్స్, పొగాకు, గుట్కా, సిగరెట్లు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. వ్యసనాల వల్ల ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తు దెబ్బతింటాయని పేర్కొన్నారు. యువత మంచి అలవాట్లను అలవర్చుకుని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా రెడ్‌క్రాస్ ఎంసీ సభ్యుడు అబ్బు సతీష్, ముప్పనపల్లి సహాయ నిధి సభ్యులు బోనాముక్కుల కాటన్ రెడ్డి, తడకల ప్రతాప్, బండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

