ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాలలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగ సందర్బంగా రేణుక ఎల్లమ్మ తల్లిని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రాజ్ కుమార్, తాళ్లపల్లి సమ్మయ్య, నీల రాజు, గజ్జల దామోదర్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, ఎల్ఐసి బుచ్చయ్య, హరినాథ్, హార్వెస్టర్ బిక్షపతి స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

……………………………………………………..
