* ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెండు, మూడు, నాలుగు, ఐదు వార్డులలో బుధవారం అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక హై స్కూల్ నుండి ఎస్సీ కాలనీ, బొడ్రాయి, రైల్వే స్టేషన్ మీదుగా వివేకానంద సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునిసిపాలిటీ పటిష్టత, వార్డుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిధులకు తోడు నా నిధుల నుండి అధిక మొత్తాన్ని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి వెచ్చిస్తున్నానన్నారు. వర్షాకాలంలో వరద నీరు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకుంటా అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, వెంకన్న, నెలమంచ అజయ్ రెడ్డి, బూర్ల లతా శంకర్, హరినాథ్, కొంతం శ్రీనివాస్2,3,4,5 వార్డు అభ్యర్థులు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………..
