*గ్రామీణ ప్రతిభకు గ్లోబల్ వేదిక సీఎం కప్
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: సీఎం కప్…గ్రామీణ ప్రతిభకు గ్లోబల్ వేదిక అని విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సీఎం కప్ లో భాగం గా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను గురువారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత చదువుతోపాటు క్రీడలలో రాణించాలనే ఉద్దేశంతో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి ల్లో సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని, క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని… క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. ప్రతీ ఆట కి సంబందించి ఒక టెక్నీక్ ఉంటుందని దాన్ని గ్రహించి.. ఫోకస్ పెడితే క్రీడల్లో రాణించవచ్చన్నారు.
ఔత్సాహిక క్రీడాకారులు సీఎం కప్ ద్వారా తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో ఇనుమడింపజేయాలని కోరారు.
క్రీడల్లో రాణిస్తే.. స్పోర్ట్స్ కోట ద్వారా ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలలో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయాన్నారు. సీఎం కప్ లో భాగం గా..నిర్వహించె
కబడ్డీ, వాలిబాల్, ఖో ఖో, అథ్లెటిక్స్, చెస్ తదితర పోటిల్లో గెలిచిన క్రీడాకారులు జిల్లా స్థాయి ల్లో జరిగే పోటిల్లో తమ ప్రతిభ ని చూపనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీవో నర్సింగరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిస్రగండ్ల సంపత్ నిర్వహణ కార్యదర్శి వంచ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు కొండా రవి, తోటకూరి వెంకటేశ్వర్లు, గీరెడ్డి ప్రమోద్ రెడ్డిలతోపాటు వివిధ మండలాల వ్యాయామ దర్శకులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
