ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4,5,6,8,9,11 వార్డులో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కెసిఆర్ కిట్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని మునిసిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అభ్యర్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
