* మద్యం – డబ్బుల పంపిణీ పై నిఘా పెట్టండి
* మున్సిపల్ ఎన్నికలకై పకడ్బందీ ఏర్పాట్లు
– వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ఆకేరు న్యూస్, హనుమకొండ :
మునిసిపల్ ఎన్నికల్లో మద్యం , డబ్బుల పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలను గురి చేసే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్భంది ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 11వ తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, ఘన్ పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయములో సమీక్షా సమావేశాన్నినిర్వహించారు
ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, కౌంటింగ్ రోజున చేపట్టాల్సిన పోలీస్ బందోబస్తు గురించి పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎవరైనా, ఎక్కడైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వుండాలన్నారు. బ్యాలెట్ పత్రాల పంపిణీ, ఎన్నికల రోజున, చివరగా కౌంటింగ్ రోజున పెద్ద సంఖ్యలో బందోబస్త్ ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేయాలని. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించే విధంగా పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. , పోలీస్ సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత, ఏ.ఎస్పీలు శుభం, చేతన్, టైనీ ఐపిఎస్ మనీషా నెహ్ర తో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.
——————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
