ఆకేరు న్యూస్, వరంగల్:వివిధ కేసుల్లో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను వాటి యజమానులకు తిరిగి అప్పగించే ప్రక్రియను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రారంభించింది. హనుమకొండ భీమారం పరిధిలోని సి.ఆర్.పి.ఎఫ్ (CRPF) కేంద్రంలో భద్రపరిచిన వాహనాలను సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించి తీసుకెళ్లాలని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. వాటిని పోలీస్ స్టేషన్ల వారిగా గుర్తించి సబంధిత వాహన యజమానులకు నోటీసులు కూడా పంపారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహ నాలను తిరిగి అంద జేయనున్నారు. మరింత సమాచారం కోసండేవిడ్ రాజ్ (ఏసీపీ, CCRB),శ్రీధర్ (రిజర్వ్ ఇన్స్పెక్టర్): 8712685158,మల్లయ్య (CCRB ఇన్స్పెక్టర్): 8008389789 నంబర్లను సంప్రదించాలని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
_________________________________________
Please tell us what is wrong. Your report will be sent to the website team.
