* మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజి గూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) క్రింద మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా భవన నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజ చేశారు. సూర్యోదయ, చంద్రోదయ మహిళా సమైక్యల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లం రవీందర్, ఉప సర్పంచ్ గద్ద కోమల కుమార్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సాదం శ్రావణి, సాదం శైలజ, కోతి మాధవి, వడ్లకొండ రజిత ఏపీవో నరేందర్, ఏఈ శ్రీనివాస్, దేవస్థానం డైరెక్టర్ వెంకటేశ్వర్లు సూపర్వైజర్ యాదగిరి, కరోబార్ శ్రీనివాస్ నాయకులు జక్కుల రాజయ్య, బల్లె రాజేందర్, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, రాజహంస, సాదం భీమయ్య వడ్లకొండ యాదగిరి, ఇద్దరు విష్ణువర్ధన్ మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి 30 తోపాటు గ్రామ మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
* ప్రభుత్వ స్థలం చదును…
కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మాణం కోసం పల్లగుట్ట- చిల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న నాలుగు గంటల ప్రభుత్వ భూమిని గ్రామస్తులందరూ కలిసి చదును చేయించారు. ఈ స్థలంలో త్వరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామస్తులు తెలిపారు.
