* దోషులను వెంటనే అరెస్టు చేయాలి
* రజక సంఘం నాయకుల డిమాండ్
ఆకేరు న్యూస్ కమలాపూర్:
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో ఇటీవల శిశు మృతి ఘటన కారకులను శిక్షించాలంటూ కమలాపూర్‌లో స్థానిక బస్టాండ్ వద్ద హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వీ వాంట్ జస్టిస్, బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ….దోషులను వెంటనే అరెస్టు చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా – రాస్తారోకోలు చేసి ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. చాకలి ఐలమ్మ వారసురాలు రెండు నెలల పసికందు బీసీ సంఘాల ఐక్యత కోసం తనువు చాలించిందని అన్నారు. రాస్తారోకో చేయడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
