రూ.2.50ల ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే కడియం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్
మండలం ఇప్పగూడెంకి చెందిన గొడిశాల చంద్రశేఖర్ అనారోగ్యానికి గురయినాడు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయగా రూ.2.50 లక్షలు మంజూరు చేయించారు. అట్టి ఎల్ఓసీ చెక్కును మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి శుక్రవారం హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్, ఉప సర్పంచ్ లింగనబోయిన రాజు నాయకులు తోడెంగల ఐలయ్య, వంగపండ్ల సోమయ్య, మంద మోగిలి తదితరులు పాల్గొన్నారు.
