*సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు
*ఎమ్మెల్యే ఎక్కడైనా శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకై ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా
జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం ఉప్పుగల్, స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరులో గురువారం ఏర్పాటు చేసిన గ్రామ సభలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు అవుతుందని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రతీ గ్రామంలో గ్రామ ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించి, గ్రామ సమస్యలను తెలుసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి ఉపయోగపడే సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు. గతంలో ఎవరైనా ఆలోచించారా పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణి చేయాలని ? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఇంటికి సన్న బియ్యం పంపిణి చెస్తోందని అన్నారు. సన్న బియ్యంతో ఈ రోజు పేద ప్రజలు కడుపు నిండా అన్నం తింటున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు గృహ అవసరాలకు సైతం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేద ప్రజల స్వంత ఇంటి కళ సాకారం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణానికి 22 వేల 500 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని తెలిపారు. వీటితోపాటు ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500లకు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, సన్నాలకు 500 రూపాయల బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది నుండి కొత్తగా రాష్ట్రంలోని కోటి 10 లక్షల కుటుంబాలకు కుటుంబ భీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారాని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి 5 లక్షల కుటుంబ భీమా పథకం వర్తించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులో ఊబిలో ఉండి 8లక్షల కోట్లకు వాయిదాలు, మిత్తిలు చెల్లీస్తూ కూడా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు.
పని చేయని వారే ఎక్కువగా మాట్లాడుతారని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు, దళిత బందు అమ్ముకున్న వారు కూడా అతిగా మాట్లాడుతున్నారని అలాంటి వారికీ మాట్లాడటానికి కొంచెం అయిన సిగ్గు ఉండాలని ఏద్దేవా చేశారు. నా రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి దగ్గరైనా పనులు ఇప్పిస్తానని, పథకాలు ఇప్పిస్తానని ఒక్క రూపాయి అయిన తీసుకున్నానో మీరే చెప్పాలని అడిగారు. అవసరమైతే నాదే రూపాయి ఖర్చు చేస్తనే తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించని స్పష్టం చేశారు. అందరికంటే ఎక్కువగా నిధులు కేటాయించి ఉప్పుగల్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప్పుగల్, పామునూరు సర్పంచులు సాంబరాజు, సంపత్ రెడ్డి, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, తహసీల్దార్లు, ఎంపీడివోలు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
