Devadula Irrigation Water Demand
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతాంగాన్ని ఆదుకునేందుకు వాదుల ద్వారా సాగునీరు అందించాలని సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో స్టేషన్ ఘన్ పూర్ ఆర్డిఓకి సిపిఐ వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సిపిఐ మండల కార్యదర్శి తోట రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం మొదలై 2 నెలలు గడుస్తున్నా వర్షాలు పడకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని నియోజకవర్గంలో 7 రిజర్వాయర్ లు ఉన్నాయి. వాటిని నింపి రైతులకు సాగునీరు అందిస్తే రైతుల కష్టాలు తీరుతాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిజర్వాయర్ ల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎండి రహ్మతుల్లా, బూర్ల యాదగిరి, పస్తం పృథ్విరాజ్, పెండేల రాజయ్య, జీడీ నర్సయ్య, బుస్సా రోహిత్, తదితరులు పాల్గొన్నారు.
