* టాప్ వన్లో ఏపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్
* టాప్ టులో తెలంగాణకు చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముగిశాయి. ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించగా, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం స్థానం మినహాయిస్తే.. మిగతావి కాంగ్రెస్, బీజేపీ చెరిసగం పంచుకున్నాయి. 18వ లోక్సభలో మన తెలుగురాష్ట్రాలకు చెందిన ఎంపీలు టాప్లో ఉన్నారు. మెజార్టీలో కాదు.. ఆస్తుల్లో. తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) దేశంలోనే అత్యంత ధనిన ఎంపీగా నిలిచారు. ఆయన ఆస్తులు 5,700 కోట్లని ప్రకటించారు. తెలంగాణలోని చేవెళ్ల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి(Konda Vishweshwar Reddy) దేశంలో రెండవ ధనిక ఎంపీగా ఉన్నారు. ఈయన తన ఆస్థుల విలువ 4,568 కోట్లుగా ప్రకటించారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర లోక్సభ నుంచి 30 వేలకు పైగా మెజార్టీతో నెగ్గిన ఆయన ఆస్థుల విలువ 1241 కోట్లుగా ఉంది. ఏపీకు చెందిన మరో అపర కోటీశ్వరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి తెలుగుదేశం తరపున ఎంపీగా విజయం సాధించారు. ఈయన ఆస్థుల విలువ 716 కోట్లుగా ఉంది. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆస్థుల విలువ 424 కోట్లు.
—————————-