CM Relief Fund Assistance
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లికి చెందిన గుర్రం వెంకటేష్ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.4 లక్షల 50 లక్షల ఎల్ఓసీ చెక్కును మాజీ ఉపముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన వారికి వైద్య సహాయం అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడితే తమ దృష్టికి తీసుకురావాలని, తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఫాతి కుమార్ పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
