Huzurabad dialysis centers sanctioned
* హుజూరాబాద్ డయాలసిస్ సెంటర్ల మంజూరుపై హర్షాతిరేకాలు
* ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, వొడితల ప్రణవ్కు క్షీరాభిషేకాలు
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
హుజూరాబాద్ నియోజకవర్గంలో డయాలసిస్ రోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం వర ప్రదాయినిగా నిలిచింది. ఏళ్ల తరబడి నిరీక్షణకు మోక్షం కలిగిస్తూ జమ్మికుంట, కమలాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాలలో (CHC) ఒక్కో ఆసుపత్రిలో 5 బెడ్ల తో డయాలసిస్ సెంటర్లను మంజూరు చేయడంపై నియోజకవర్గ వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు కొరకై విశేషమైన కృషి చేసిన హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ చొరవను అభినందిస్తూ, శుక్రవారం ప్రధాన కూడళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు.
గతంలో డయాలసిస్ కోసం రోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఆర్థికంగా, శారీరకగా ఎన్నో ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు ఏర్పాటుతో స్థానికంగానే ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం కేంద్రాల మంజూరుకే పరిమితం కాకుండా, ఆసుపత్రుల మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం వొడితల ప్రణవ్ జమ్మికుంట, హుజూరాబాద్ ఆసుపత్రులకు చెరో 15 లక్షల రూపాయలు కేటాయించడం ఆయన సేవా నిరతికి నిదర్శనమని పేర్కొన్నారు. హుజురాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె సుహాసిని, వివిధ విభాగాల చైర్మన్లు, మండల అధ్యక్షులు పాల్గొనగా, కమలాపూర్ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, పోడేటి బిక్షపతి, ఉపసర్పంచ్ పుల్ల శ్రీనివాస్, మొండెద్దుల నాగరాజు, తడక శ్రీకాంత్, మాట్ల రమేష్, చెరిపల్లి రామచంద్రం, గట్టు శ్రీధర్, ఆకినపల్లి బిక్షపతి, మిల్కూరి శ్రీనివాస్, ఆకునూరి సాంబయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
