Fatehpur Durgamma temple festival
* రేపు, ఎల్లుండి 9వ వార్షికోత్సవం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ దుర్గమ్మ ఆలయాన్ని ముస్తాబు చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు జరిగే దుర్గమ్మ తల్లి 9వ వార్షికోత్సవం కోసం ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దుర్గామాత వార్షికోత్సవానికి వివిధ గ్రామాల నుండి వచ్చే గ్రామస్తులు సురక్షితంగా గ్రామం చేరేందుకోసం కృష్ణాజి గూడెం నుండి ఫతేపూర్ దుర్గామాత ఆలయం వరకు రోడ్డుకు పడిన గుంతలలో మట్టి పోసి చదును చేశారు. రేపు సోమవారం దుర్గామాతకు బోనాల సమర్పించగా మంగళవారం మొక్కులు చెల్లించుకుని ఊరంతా పండుగ జరుపుకుంటారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
