Medaram ministers temple visit
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లతో కలిసి దర్శించుకున్నారు. దేవాలయ శాఖ అధికారులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు.ఆదివాసీల ఆచార సంప్రదాయాల ప్రకారం అమ్మవార్ల గద్దెల పై పసుపు కుంకుమ బంగారం ( బెల్లం) సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. మొదట మంత్రి శ్రీనివాసరెడ్డి తన ఎత్తు బంగారం (బెల్లం) తులాభారం వేశారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు పూజారులు ఆలయ మర్యాదల ప్రకారం మంత్రులకు ఎమ్మెల్యేలకు అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఏ ఎస్ పి మనన్ భట్,
డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మేడారం కార్యనిర్వాహణాధికారి వీరస్వామి, సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
