Station Ghanpur hospital development
* పేదలకు మెరుగైన వైద్య సేవలు
… ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
నియోజకవర్గంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రధాన కర్తవ్యంగా పని చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో 20 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ రే యూనిట్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎక్స్ రే యూనిట్ పని తీరును డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలందరికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నేను ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత 45 కోట్లతో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయుంచడం జరిగిందని ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 31 డిసెంబర్ 2026వరకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేసి నియోజకవర్గం ప్రజలకు 2027 నూతన సంవత్సర కానుకంగా అందించాలినేది నా సంకల్పం ఆరు. ప్రస్తుతం ఉన్న ఏరియా హాస్పిటల్ లో ఎక్స రే యూనిట్ లేదు. డయాలసిస్ సెంటర్ లేదని, గతంలో మంజూరైన డయాలసిస్ సెంటర్ సరియైన వసతులు లేక జఫర్ గడ్ షిఫ్ట్ చేయడం జరిగిందని అన్నారు డయాలసిస్ సెంటర్ జఫర్ గడ్ లో బాగా పని చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఎక్స్ రే యూనిట్ లు ఉన్నాయి కానీ స్టేషన్ ఘన్ పూర్ లో లేదని ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి రూ.25 లక్షలతో ఎక్స రే మంజురు చేయించడం జరిగిందని తెలిపారు. ఎక్స్ రే యూనిట్ పని చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్నాయని ఎక్స్ రే యూనిట్ ను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ సీఈఓ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఉన్నారని ఆయన రాగానే 15 రోజుల లోపే ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ ప్రారంభం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయ్యే వరకు అన్ని రకాల వైద్య సేవలు ఏరియా ఆసుపత్రిలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో ఆపేరేషన్ థియేటర్ కు సంబందించిన సామాగ్రి వచ్చిందని త్వరలోనే ఆపరేషన్ థియేటర్ ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఏరియా ఆసుపత్రిలో అన్ని విభాగలకు సంబందించిన అన్ని డాక్టర్లు ఉన్నారని ఎక్స్ రే, ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ సెంటర్ ఇవ్వన్ని కూడ పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాస్పిటల్ పరిసరాలు లోపల బయట పరిశుభ్రంగా ఉంచుకోవాలని దానికి మున్సిపల్ చైర్మన్ , కమిషనర్ సహకరించలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఇన్ టైమ్ లో హాస్పిటల్ కు వచ్చేలా చూసుకోవాలని ఆదేశించారు. 24 గంటలు పని చేసే హాస్పిటల్ లో అందరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమస్యలు ఉంటే నా ద్రుష్టికి, కలెక్టర్ ద్రుష్టికి తీసుకెలేతే వెంటనే పరిష్కరించి ప్రజకు మెరుగైన సేవలు అందించేలా చూస్తామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ లో కాలేజీ లో ఏంఎల్టి, ఏఎన్ఏం కోర్స్ లు ఏర్పాటు చేయిస్తే పిల్లలకు చదువు కు ఉపయోగపడుతుందని అలాగే ట్రైనింగ్ కూడా హాస్పిటల్ లో చేసుకావొచ్చని అన్నారు. ఈ విద్య సంవత్సరంలోనే ఎంఏల్టీ, ఏఎన్ఎం కోర్సులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, వైద్య అధికారులు, వైద్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
