Warangal Congress Murder Case
Published:
Updated: 26 Jul 2026 • 03:31 PM
అకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపిఎస్ కేసులు వివరాలు తెలిపారు.ఫిర్యాది అడుపు నాగలక్ష్మీ, భర్తపేరు మహేష్, వయస్సు, కులం మున్నూరు కాపు, నివాసం ఎన్.టి.ఆర్ నగర్, ఎనుమాముల, వరంగల్ జిల్లా. ఫిర్యాది భర్త మృతుడు అడపు మహేష్, తండ్రి పేరు బిక్షపతి, వయస్సు45, కులం మున్నూరుకాపు, వృత్తి వ్యాపారం, నివాసం ఎన్.టి.ఆర్ నగర్, ఎనుమాముల, వరంగల్ జిల్లా.
గతంలో ఒక హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడి బెయిల్‌పై తిరిగి వచ్చిన ప్రధాన నిందితుడు పత్తి కుమార స్వామి,అలియాస్ కుమార్, తండ్రి పేరు నరసయ్య, వయస్సు 35,కులం బుడగ జంగాలు, వృత్తి డ్రైవర్, నివాసం బాలాజీ నగర్,ఎనుమాముల, వరంగల్ జిల్లా. తనపై తప్పుడు ప్రచారం చేసి స్థానిక ప్రజాప్రతినిధి వద్ద తన రాజకీయ ప్రాధాన్యతను దెబ్బతీస్తున్నాడనే అనుమానంతో అడుప మహేష్‌పై ప్రధాన నిందితుడు పట్టి కుమార స్వామి పాత కక్షలను మనసులో పెట్టుకోని ఏవిధంగానైనా మృతుడుని చంపాలనే ఉద్యేశంతో మిగితా నిందితులలైన. 2.గంధం నరేష్, తండ్రిపేరు నర్సయ్య, వయస్సు 40, బాలాజీ నగర్, ఏనుమాముల, వరంగల్ జిల్లా.3.జన్ను మధు, తండ్రి పేరు మాణిక్యం, వయస్సు 42, ఎస్.ఆర్ నగర్, ఏనుమాముల, వరంగల్ జిల్లా, 4. పిట్ల శ్రీనివాస్ ఆలియాస్ బండి శ్రీను, తండ్రి పేరు ఎల్లయ్య, తూఫ్రాన్, మెదక్ జిల్లా. 5.సురేష్, ఎన్.టి.ఆర్ నగర్, వరంగల్ జిల్లా.( ప్రస్తుతం పరారీలో వున్నాడు ),6.లాసాని రాం సాయి, తండ్రి పేరు నర్సింగరావు, సుందరయ్య నగర్, వరంగల్ జిల్లా. 7.టోని సంజయ్య,తండ్రిపేరు ఆంటోని, వయస్సు 36, ఆళ్వాల్, సికింద్రాబాద్, 8.పోతారం శివకుమార్, తండ్రిపేరు మొగులయ్య, వయస్సు 35,ఈస్ట్ మారెడు పల్లి, సికింద్రాబాద్‌కు చెందిన నిందితుల కలసి మృతుడు అడుప మహేష్‌ను హత్య చేసేందుకు సిద్దపడి. ఈ నెల 18వ తేదిన రాత్రి తొమ్మిది నుండి పది గంటల సమయంలో నిందితులు పరిమళ కాలనీ రోడ్డు నంబర్ 2 వద్ద మృతుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
ఈ సంఘటలో మృతుడు తీవ్రంగా గాయంపడటంతో స్థానిక హస్పటల్లో చికిత్స పోందుతూ ఈ నెల 19వ తేది రాత్రి 7గంటలకు మరణించాడు. ఈ సంఘటనపై గీసుగొండ పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు చేసిన కేసు దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్ దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరగా పట్టుకొనేందుకుగాను ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి ఈ హత్యకు పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జూడిషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.
ఈ కేసులో దర్యాప్తుగా వేగంగా పూర్తి చేసి గౌరవ న్యాయస్థానం ద్వారా నిందితులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకొవడం జరుగుతుంది.
ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచనిన మామÖనూరు ఏసిపి వెంకట్, టాస్క్‌ఫోర్స్ ఏసిపి మధుసూదన్, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్లు బాబులాల్, సుబ్బారెడ్డి,దేవేందర్,శ్రీధర్‌తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్, టాస్క్ఫొర్స్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అభినందనలు తెలియజేయడం జరిగింది
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
