Chandrababu visits Balakrishna in AIG Hospital
* ఏఐజీ ఆస్పత్రిలో బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లోని ఏఐజీ (AIG) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్లి పరామర్శించారు.
ఇటీవల ఓ సినిమా షూటింగ్లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
చికిత్స అందిస్తున్న డాక్టర్లు మరియు చిత్ర బృందంతో మాట్లాడి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
