RTC STRIKE NARSAMPET DRIVER SUICIDE MGM
* ఎంజీఎం వద్ద ఉధ్రిక్తత
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ లో ఉద్రిక్త వాతావారణం నెలకొన్నది. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ హత్యాయత్నం చేసుకోవడంతో హుటా హుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఎంజీఎం ఆస్పత్రికి తరలి వచ్చారు. జిల్లా కలెక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎంజీఎంకు చేరుకున్నారు. చికిత్స పొందుతున్న శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన చికత్స కోసం హైదరాబాద్ తరలించాలని జిల్లా కలెక్టర్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు,
కాగా శంకర్ గౌడ్ 80 శాతం వరకు కాలినట్లు వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శంకర్ గౌడ్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
* ఎంజీఎం వద్ద టెన్షన్.. టెన్షన్
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం సమాచారం తెలుసుకుని ఎంజీఎం ఆస్పత్రికి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున్న చేరుకున్నారు. అదే విదంగా టీఆర్ ఎస్ , బీజేపీ నాయకులు కూడా ఆస్పత్రికి చేరుకుని శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని డిపోల్లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు అక్కడికి చేరుకున్నారు. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఎంజీఎం ఆస్పత్రిలోని చికిత్స పొందుతున్న శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. దీంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందో బస్త్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టో లో కాంగ్రెస్ పార్టీ పొందుపరచిన ఆర్టీసీ విలీన అంశాలతో పాటు ఇతర ఏ సమస్యను పట్టించుకోవడం లేదంటూ తీవ్రంగా విమర్శించారు. శంకర్ గౌడ్ ఆత్మ హత్యాయత్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరే కారణమని తీవ్రంగా విమర్శించారు. కాగా రాజకీయాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము మద్దతు తెలుపుతున్నామని బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అన్నారు. ఆర్టీసీ కార్మికులు కనీసం సమ్మె చేసుకునే కనీస ప్రజాస్వామిక హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని మాజీ మంత్రి , మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుధర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్‌లు అన్నారు.
————————————–

1 thought on “TGSRTC SAMME | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం”